12, జూన్ 2020, శుక్రవారం

అందరికీ నమస్కారం


హలో.

అందరికీ నమస్కారం.

అలా అందరికీ నమస్కారం చెప్పాలి ముందస్తుగా అని మా అమ్మ చెప్పింది.  ఆమాటే మా ఫ్రెండూ చెప్పాడు లెండి. అందుకే మొట్టమొదట మీ అందరికీ‌ నమస్కారాలు పెట్టేస్తున్నానన్న మాట.

లేకపోతే నాకేం‌ కర్మం నమస్కారాలు పెట్టటానికీ. అందులోనూ‌ తెలియని వాళ్ళకీ, తెలిసీ తెలియని వాళ్ళకీను. అసలు తెలిసిన వాళ్ళకి ఐనా సరే, నమస్కారం పెట్టటమే‌ నాకు ఆట్టే బాగుండదు.

ఎందుకంటే‌ నమస్కారాలు పెట్టించుకున్న వాళ్ళలో ఎక్కువమంది అవతలి వాడేదో కాస్త తక్కువ తరగతి వాడన్నట్లు పోజు పెడతారు. కొంత మందైతే అస్సలు నా నమస్కారం అన్నమాటనే వినీ విననట్లే ఉంటారు. ఇంకొంచెం‌ మంది పాపం వాళ్ళూ‌ వెంటనే‌ నమస్కారం అనేస్తారు కాని వాళ్ళల్లో కూడా ఆ ముక్కేదో మొక్కుబడిగా అనే‌ వాళ్ళే ఎక్కువ.

ఐనా, ఏ‌మాటకామాట చెప్పుకోవాలి. నిజంగా సంతోషంగా నాక్కూడా నమస్కారం చెప్పేవాళ్ళూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు లెండి.

ఈ సంగతులన్నీ‌ మా అమ్మతో‌ అంటే ఆవిడ కాస్తా, ఒరే పిచ్చి రాముడూ, ఎవళ్ళెలాంటి వాళ్ళైతే నీకేంరా, నువ్వు మాత్రం అందరికీ‌ మంచి బుధ్ధితో‌ నమస్కారం పెట్టూ, తెలిసిందా అని ఘట్టిగా చెప్పింది.

మీక్కూడా తెలుసును కదా? అమ్మ ఎల్లా చెబుతే అల్లాగే చేయాలి. అది రూలు. అందుకని మీ‌ అందరికీ‌ నమస్కారం చెబుతున్నాను అన్నమాట.

అన్నట్లు నా పేరేదో‌ చెప్పనే లేదు కదూ.

అస్సలు పేరు ఏదో ఒకటి గొప్పగా పెట్టారు లెండి. కానీ‌ అందరూ రాముడూ అంటారు. ఐనా చక్కగా శ్ర్రీసీతారామచంద్రస్వామి అని పూర్తిగా పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ సొమ్మేం పోతుంది చెప్పండి.

ఒక్కళ్ళూ అలా చచ్చినా నన్ను పిలవరు. అదేం‌ కర్మమో!

మావాళ్ళల్లో అందరూ రాముడూ రాముడూ అనే పిలుస్తారు

కాని మా అమ్మ ఉందేం. వట్టి పిచ్చిది. నన్ను పిచ్చి రాముడూ అంటుంది అప్పుడప్పుడూ. ప్రేమగానే అన్నమాట.

అమ్మ అలా పిలిస్తే బాగుంటుంది. కాని ఊళ్ళో జనం అంతా కూడా ఆముక్కే‌ పట్టుకొని అందరూ‌ నన్ను పిచ్చి రాముడూ అనే పిలుస్తున్నారు.

అది మాత్రం ఏమీ‌ బాగోలేదు.

మా అమ్మకైతే‌ నాకు బళ్ళో హిందీలో సున్నా మార్కులు వచ్చినప్పుడూ‌ పిచ్చి రాముణ్ణే, లెక్కల్లో వందకి వందా వచ్చినప్పుడూ పిచ్చి రాముణ్ణే.

అది వేరే సంగతి.

కాని ఊళ్ళో వాళ్ళకేం పోయే‌కాలం?‌ అందరూ పిచ్చి రాముడూ పిచ్చి రాముడూ అనే వాళ్ళే!

పోనీలెండి. ఇప్పుడు అందరితోనూ తగవులు పడుతూ కూర్చోలేను కదా. అందులోనూ ఎవరితోనూ తగవులు పడకూడదూ‌ అని అమ్మ చాలా సార్లు హెచ్చరించి మరీ చెప్పాక, తగవులకూ‌ నాకూ రాం రాం ఐపోయింది.

ఈ పిచ్చి రాముడూ అన్న పేరును ఎలా వదిలించుకోవాలీ అని బోలెడు సార్లు బుర్ర బద్దలు కొట్టుకున్నాను కాని మంచి ఉపాయం ఏదీ తోచలేదు. తోచిన చిల్లరమల్లర ఉపాయాలు ఒక్కటీ‌ బొత్తిగా పని చేయలేదు.

చివరాఖరిని అమ్మనే ఆ ఉపాయం ఏదో చెప్పమని బతిమాలితే ఏమందో తెలుసునా?

ఎవడి బతుకులో వాడే మంచిగా బతికే ఉపాయాలు వెతుక్కోవాల్రా పిచ్చి రాముడూ అని.

మొర్రో, ఆ పిచ్చి రాముడే ఇంక వద్దే‌ అమ్మా అంటే అమ్మ కూడా వినటం లేదు.

బోల్డన్ని రోజులు ఆలోచించాక ఒక ఉపాయం తట్టింది.

ఐతే అమ్మకి ఆ ఉపాయం నచ్చుతుందో‌ లేదో అని ఇప్పుడు అడగటానికి కుదరదు కదా. ఎందుకంటే ఆ బోల్డన్ని రోజుల్లో ఒక నాడు ఆవిడ కాస్తా కొంచెం జాగ్రత్తగా బతకరా పిచ్చి రాముడూ అనేసి చక్కాపోయింది.

బాగా జాగ్రత్తగా ఆలోచించి కనిపెట్టిన ఆ ఉపాయం ఇదే.

నా అంతట నేనే అందరికీ పిచ్చి రాముణ్ణి అని దర్జాగా చెప్పేసుకోవటం.

ఎప్పటికైనా సరే పిచ్చి రాముడు అన్న పేరు వినగానే జనం ఓహో అని గౌరవంగా చూడాలి.

అందుకనే ఇదిగో మీ అందరి ముందుకూ వచ్చి కూర్చుంటున్నది.

ఇకనుండీ నా అలోచనలూ వగైరా మీరు కూడా తెలుసుకోవటం చెయ్యవచ్చును. ఎప్పుడూ‌ నా ఆలోచనలూ వగైరా అన్నీ నా లోపలే ఉండిపోతే ప్రపంచం పిచ్చి రాముడికి నిజంగానే‌ పిచ్చి అనుకుంటుంది. అవును ఆ ప్రమాదం తప్పకుండా ఉంది.

ఇప్పుడు నా నమస్కారాలు అందుకున్నారా? మరి ఇంక మీదట నా ఆలోచనలు కూడా అందుకోండి ఫ్ర్రెండ్స్.

బావుంటాయి.


35 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ, పిచ్చి రాముడి నమస్కారాలు అందుకున్నందుకు చాలా సంతోషం.

      తొలగించండి


  2. చివరాఖరిని బాగుందండి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరాఖరికి అన్నీ‌ బాగుంటాయి కదండీ. అంటేనూ‌ కొన్ని మనకి ముందస్తుగా సరిగ్గా అర్ధం కాక బావుండవు కాని కొసాకి వచ్చాక చక్కగా అర్ధం అవుతాయి కదా. అప్పుడు బావుంటాయి. మీకు నచ్చింది కదా మరింకేం. అది చాలు.

      తొలగించండి
  3. మీలాంటి పిచ్చి, సారీ, మంచి రాముడు రావల్సిన చోటు ఇది కాదేమోనని నా అనుమానం. కానీండి, రానే వచ్చారుగా, ఎందుకొచ్చానురా బాబూ! అనుకునే రోజు మీకు కాస్తంత లేట్ గా రావాలని మనసారా కోరుకుంటూ ... ఆహ్వానం శ్రీ రాముడు గారూ _/\_ ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచోణ్ణో పిచ్చాణ్ణో‌వచ్చేసాను కదండీ. ఇదంత మంచి చోటు కాదా! అయ్యో. పిచ్చి రాముణ్ణి అనిపించుకున్నానే ఇలా పొరపాటు పడి!

      తొలగించండి
  4. పిచ్చిరాముడుగారు,
    మిమ్మల్ని రాముడే రచ్చించాలి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అదేమండోయ్ బండి రావు గారు మీరు పొందుతున్న బ్లాగానందము ఇతరులకు దక్కనీకుండా వచ్చీ రాక ముందే రాముల వారిని భయపెట్టించేస్తున్నారు ?


      తొలగించండి
    2. రాముడు అందర్నీ రక్షిస్తాడని అమ్మ చెప్పిందండీ. అంతే కదా.

      తొలగించండి
  5. జిలేబీ ఇనప వడ పైకూలు, శంకరాభరణం సమస్యలు మాలిక వ్యాఖ్యల తొలగించడం హాయిగా ఉంది. Thank you maalika. Please continue the same in future.

    రిప్లయితొలగించండి
  6. మీ నమస్కారాలకి నా ఆశీస్సులు. అట్లాగే మొహమాటం కొద్దీ మీకు నా నమస్కారాలు!!☺️

    "అమ్మ ఎల్లా చెబుతే అల్లాగే చేయాలి" ఈ డైలాగ్ ఇక్కడ చెబితే చెప్పారుగాని శ్రీమతి దగ్గర మాత్రం అనొద్దు. లేదంటే పిచ్చిరాముడు కాస్తా పెళ్ళాం వదిలేసిన వెర్రి రాముడైపోగలడు☺️☺️

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత ల తరుపున ఇదే మా ఆహ్వానం . తప్పులు చెప్తే సరిద్దుకుంటారని ఆశిస్తున్నాం . మొన్నే ఒక రచయిత్రి ( ? ) తనకున్న మిడి మిడి కుల జ్ఞానం తో , ఒక పోస్ట్ వ్రాసారు , తప్పు అని రుజువులు చూపించిన ప్రతీ కామెంట్ ని పీకి పడేసి , పోస్ట్ ని మాత్రం అలానే ఉంచి , ఎవరు కామెంట్ చేయకుండా బ్లాక్ చేసేసారు . అజ్ఞాత నారదులు ని నియంత్రించే అధికారం మీకు ఎప్పుడు ఉంటుంది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనానిమస్ వాక్యలు ఎక్కువ భాగం నిక్కచ్చిగా నిజం చెబుతాయి. ఆ నిజాలను ఒప్పుకో లేని ఓర్చుకో లేని బ్లాగర్లు మాత్రమే మాడారేషన్ పెట్టుకోని దాక్కుంటాయి.

      తొలగించండి
    2. ఈ ఇద్దరు అజ్ఞాత వ్యక్తులూ కూడా పిచ్చోళ్ళ లాగా ఉన్నారే. ఎందుకని ఇక్కడ రాసారూ‌ఈ ముక్కలూ? నేను చెప్పిందేమిటీ మీరు రాసిందేమిటీ? ఏమన్నా సంబందం ఉందా? ఎంత పిచ్చి రాముడైనా ఆమాత్రం కనుక్కోలేడని అనుకున్నారా? బలే! ఇంకెప్పుడూ అలా రాయకండేం.

      తొలగించండి
  8. దొంగ, రౌడీ, డ్రైవర్, టాక్సీ, అడవి, అల్లరి, బండ etc. అన్ని అయిపోయాయా?
    ఇప్పుడు పిచ్చి రాముడు అంటున్నారు. దాల్ మే కుచ్ కాలా హై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ాాముల్యమైన అభిప్రాయంలో పిచ్చిరాముడి గారి పిచ్చిలో ఏదో పచ్చి లేక పచ్చ మోసం దాగుందనా శంక?
      నాకైతే రోజంతా గోడ పక్కనుండి సైలెంట్ గా మన పిచ్చ లెక్కలు తీస్తున్నట్లుగా ఉంది.
      నో డౌట్ కాలా మే కుచ్ దాల్ హై. హై.

      తొలగించండి
    2. నో డౌట్ కాలా మే కుచ్ దాల్ హై అంటారేమిటీ? మీక్కూడా హిందీ‌ అంత బాగా రాదా?

      తొలగించండి
  9. ఈ బ్లాగరు గారికి (పిచ్చి రాముడు అని వ్రాయడానికి నా కీబోర్డ్ సుముఖంగా లేదు. వాళ్ళ అమ్మగారు అలా పిలవచ్చు గానీ మనం పిలిస్తే బాగోదు అంటోంది కీబోర్డ్),

    మీకు నా వైపు నుండి కొన్ని ఉ.బో.సలు. (1). పాఠకుల సౌకర్యార్థం (clickable) Blog Archive పెట్టండి మీ టపాల లిస్ట్ చూసుకోవడానికి; (2). అలాగే Next .... Previous లేదా < > అనే clickable buttons పెట్టండి పాఠకుల సౌకర్యార్థం; (3). మీ profile పెట్టండి .... చిన్నదో, పెద్దదో. మీ profile కాస్తైనా పాఠకులకు తెలియాలి కదా. .
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సూచన బాగుందండీ. థీం మార్చానన్న మాట అందుకే. ఇప్పుడు మీకు మరింత సౌకర్యంగా ఉండవచ్చును. బోలెడన్ని ధన్యవాదా లన్నమాట.

      తొలగించండి
    2. మార్పులు చేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  10. మరొక ఉ.బో.స. 👇
    వీలయితే మీ బ్లాగును “శోధిని” అగ్రిగేటర్ కు కూడా అనుసంధానం చెయ్యండి మరింత కవరేజ్ కోసం.

    sodhini.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓ. శోధిని ఒకటుందాండీ. బావుండండి అది కూడా. అక్కడ కూడా ఈబ్లాగును చేర్చుకోమని అడిగానండి. చూదాం వాళ్ళు అలాగే అంటారో లేదో.

      తొలగించండి
  11. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
    ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
    నమ్మినవేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
    యమ్మ కృపాభ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
    శ్రీమాత్రేనమః

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ‌ పజ్జెం‌ నాకొచ్చండీ చిన్నప్పుడే. మూలపుటమ్మ అంటే అదేదో మూలన కూర్చునే అమ్మ అనా అని మా అమ్మని అడిగితే భలే నవ్వుకుందండీ.

      తొలగించండి
  12. వచ్చిరి రామచంద్రులట ! వారధిగట్టిన గట్టివానిలా
    నచ్చిరి , పిచ్చిరాము డవునా? యుహుహూ , యసలీ బుధుండు తా
    నిచ్చలు బ్లాగులో వెలయు నింతకుమున్నె, యనేటి డౌటుయున్
    గుచ్చెడు నెమ్మదిన్ , నరస కోవిదులే శరణంబు తెల్పగన్ 🙏 .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్య బాబోయ్. పిచ్చి రాముడి మీద అనుమానాలొచ్చేస్తున్నాయా!? పత్తేదార్లూ వస్తూనే ఉండుంటారూ. ఎలాగండీ బాబూ. ఇదేదో ప్రమాదకరమైన లోకంలా ఉందే దేవుడా.

      తొలగించండి
    2. గురూగారూ మీరన్నాకా నాక్కూడా ఇదేదో ... పాకం లానే కని/అని/పిస్తోంది. ఆ సకలకళావల్లవన్ కు తెలియని ఠక్కుఠమార, గోకర్ణ గజకర్ణ విద్దెలు, చోద్దేలూ మనమెరుగనివా? (మనమెరుగుదుమా!?). ఏంటో బుర్రన్తా కంగాళీగా ఉంది! అసలెవళు పిచ్చొళ్ళో అర్థమై చావడంలే!

      తొలగించండి
  13. ఓ సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు “నన్ను involve చెయ్యకండి” మాస్టారూ 🙏. అసలే మీ నెల్లూరు జిల్లా వారితో సరదాగా మాట్లాడడం కించిత్ ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం అని నా అనుభవం, కాబట్టి నన్నొదిలెయ్యండి.

    సరే, ఇహ పెద్దలు మీరడిగారు గనుక కాదనలేక చెబుతున్నాను. ఈ బ్లాగరు గారు పాతకాపు కాదేమోనని నా అభిప్రాయం. మీరు, “జిలేబి” గారు ఇంకా తదితర పెద్దలు బ్లాగులోకంలో నాకంటే తగుమాత్రం సీనియర్లు కావున మీలాంటివారే ఇంకా బాగా పసిగట్టగలరేమో? 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పెద్దోళ్ళందరికి చాదస్తాలెక్కువైపోనాయండి వినరా గారు :)


      ఏ కొత్తూరోళ్ళొచ్చినా , నెల్లూరోళ్ళొచ్చినా ఓల్డు రస్టిక్కే అనుకుంటున్నారు :)



      జిలేబి

      తొలగించండి
  14. సీతారామస్వామీ !
    పాతా కొత్తా యనంగ పనిలేదండీ ,
    ఏతావత్ ' బ్లాగ్ తబలా '
    మోత భలేగుంది , జోర్గ మ్రోయించండీ !

    రిప్లయితొలగించండి
  15. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.
    ఈ పజ్జెం నాకూ వచ్చునండి. చిన్నప్పుడు అమ్మ చెప్పిందండి.
    అర్ధమేకాలేదు కదూ :)

    రిప్లయితొలగించండి
  16. అమ్మనుఅధికంగా ప్రేమిస్తే గౌరవిస్తే ఓర్వలేమా? తనికెళ్ళ నాన్నా?
    .......................................
    దెబ్బతగిలిన బిడ్డ అమ్మా అనే
    అంటాడు నాన్నా అనడని బాధ పడ్డ తనికెళ్ళ.

    అమ్మతొమ్మిది నెలలు మోస్తే
    నాన్న పాతికేళ్ళు మోస్తాడంటూ
    రెండూ సమానమే ఐనా అంటూ పైకి అన్నా
    సమానమెట్లవుతుంది
    అయినా మేమేదో పెద్దమనసుతో సమానమంటున్నామన్నట్లు వ్యాఖ్య.

    కానీ అమ్మ కూడా పాతికేళ్ళుకాదు. బ్రతికున్నంతవరకు బిడ్డల్ని మోస్తుంది.
    తొమ్మిదినెలలు కడుపులో.
    ఆ తరువాత పొత్తిళ్ళలో
    చంకలో
    ఆ పై పెళ్ళయ్యేదాక కళ్ళల్లో గుండెల్లో.
    పెళ్ళయ్యాక కూడా కూతురికిపురుళ్ళుపోసి ఆ కూతురికి పుట్టిన పిల్లలబాధ్యతల్నికూడా భారంగాభావించక ..గారాబం పంచేది అమ్మే.
    కొడుకుకుపుట్టిన బిడ్డల్ని ప్రేమగా లాలించేది కూడా అమ్మే.

    అంటే తల్లిమోసేది తొమ్మిది నెలలు కాదు ..తాను బ్రతికున్నంతకాలం బిడ్డలకుబిడ్డలు పుడుతున్నంతకాలం.
    ఒక భర్తగా కాక ఒక కొడుకుగా ఆలోచించలేకపోయారు మహనీయునిస్థాయికి ఎదిగిన పూజనీయులైన తనికెళ్ళ వారు.



    తనికెళ్ళ కూడా చిన్నప్పుడు క్రిందపడ్డప్పుడు అమ్మా అనే అరిచి వుంటాడు.నాన్నా అని ఎందుకు అరవలేదో తనకు తెలియదా?
    జీతం లేకుండా అమ్మ గుర్తింపుపొందితే

    జీతం అంతా ఇంట్లో ఇస్తూకూడానాన్న గుర్తింపు పొందలేదన్నాడు తనికెళ్ళవారు.

    మద్యం సిగరెట్లు త్రాగుళ్ళు సరదాలు తిరుగుళ్ళకు తగలేశాక మిగిలిన సొమ్మేకదా నాన్నలు ఇంట్లో ఇచ్చేది.
    శివభక్తులు దాంతులు వేదాంతులుదైవస్వరూపులైన తనికెళ్ళవారు తన సంపాదన నయాపైసాతో సహా ఇంట్లో ఇచ్చి ఉండవచ్చు.
    కానీ సగటు నాన్నలు అలా వుండరు.

    అడిగినవన్నీ చేసి పెట్టాలంటే అమ్మకి ఇంట్లో అన్నీఉండాలి.
    తయారు చేయటం కుదరక పిల్లలకు చిరుతిళ్ళు బయట కొనిపెట్టాలంటే అమ్మకు చేతిలో డబ్బు ఉండాలి. అంటే నాన్న ఇవ్వాలి.

    ఇంట్లో సరుకులు లేక పోవటం
    అమ్మకు నాన్న పైసలివ్వక పోవటం ..నాన్న త్రాగి అర్థరాత్రులు ఇంటికి రావటం
    స్నేహితులతో జలసాలు చేస్తూ విలాసంగా తిరుగుతూ పిల్లల కంటపడటం.. సగటు కుటుంబాలలో మామూలే.
    అందుకే ప్రత్యక్షసత్యసాక్షులైన పిల్లలు అమ్మను ప్రేమించినంతగా నాన్నను ప్రేమించలేరు.

    పూజ్యశ్రీ తనికెళ్ళవారికి అటువంటి పేదకుటుంబాల వెతలు తెలియవు.

    అమ్మకు పిల్లలకు బీరువానిండా బట్లలు
    నాన్నకు దండెంకూడా నిండదు.


    బట్టలు బిగుతయిపోయాయి,చిరిగిపోయాయి ,వెలిసిపోయాయి,అంటూ బీరువానిండా బట్టలున్నా అందులో తొడుక్కోవడానికి పనికి వచ్చేవి ఎన్నో ఏవిటో అమ్మకి మాత్రమే తెలుసు.
    మాకు కూడా తెలీదు.
    అవి కట్టుకుని ఫంక్షన్ కి వెళితే పరువుపోతుందని బాధపడేది అమ్మే.
    గుండీలు హుక్సులూ మా బట్టలకు నాన్నకుకూడా కుట్టేది అమ్మే.
    పండుగ కీ ,పెళ్ళికీ ,బడికీ ,బట్టలు కొనిపెట్టమని బిడ్డలబట్టల కోసం అమ్మ ఏడ్వటం చూస్తారు బిడ్డలు.

    ఊర్లకీ,క్యాంపులకు వెళ్ళివచ్చిన ప్రతిసారీ మంచి మంచి షూస్ బట్టలు తనకై నాన్న తెచ్చుకోవటం బిడ్డలకు తెలుసుకదా.
    అందుకే నాన్న అవసరమైతే ఏ క్షణంలో నైన కొనుక్కోగలిగిన సర్వ స్వతంత్రుడు కదా ఆయన కేం మా రాజు అని తృప్తిగా ఉంటారు నాన్న విషయంలో.
    బీరువానిండా వున్నప్పటికీ వాటిలో పనికీ రానిచీరలే ఎక్కువ. అమ్మ ఇంట్లో కట్టుకుంటుంది గుట్టుగా.
    ఇంటిగుట్టు అమ్మకు తెలిసినంతగా నాన్నకు తెలీదు.

    నాన్నకు మోటారు సైకిల్ కారు ఉంటాయ్ .
    అమ్మకు వాటిని ఎక్కాలంటే నాన్న అనుమతికావాలి.
    బండిపెట్రోలు ఖర్చుకు డబ్బుంటుంది. కానీ అమ్మను బిడ్డలమైన మమ్మల్ని సినిమాకు తీసుకెళ్ళాలంటే డబ్బుండదు.టై ఉండదు.

    చేతికి రెండుంగరాలు ,మెళ్ళోచైను మా నాన్న శరీరంలో భాగాల్లా మెరుస్తూంటాయ్ తళతళా.

    అమ్మ మెళ్ళోని బంగారుతాళిబొట్టుచైను మాత్రం కష్టమొచ్చిన ప్రతిసారీ తాకట్టుకెళుతుంది.
    అమ్మనగలెప్పుడూ మా అవసరాలు తీర్చే పరికరాలే.
    సగటు బతుకులను గురించి గురుతుల్యులు తనికెళ్ళ భరణివారికి తెలియదు.

    ఎప్పుడో ఒకప్పుడు పిల్లలు తృప్తిగా తిన్నప్పుడు ..నాన్న పచ్చడి మెతుకులు తిన్నాడేమో..
    కానీ ..అమ్మరోజూ తినేది..మిగిలిన పులుసే అడుగంటిన మెతుకులే. అవి కూడా బిడ్డలమైన మేమూ నాన్నా తినంగా మిగిలితేనే.
    అమ్మ పస్తుందని తెలిసేది అమ్మతనకు తానుగా చెప్పితేనే.
    అమ్మ ఎవరికీ చెప్పదుగా మనకై మనం చూస్తేతప్ప.
    తెలిస్తే నాన్నైనా బిడ్డలైనా తెలిస్తే బాధపడతారని రహస్యంగా దాస్తుంది తప్ప!

    ఇలా నాన్న తాను వెనుక బడ్డానని బాధపడతాడని తెలిస్తే!
    నాన్నను పొగిడేస్తుంది అమ్మ!
    చులకన చేసిచూస్తున్న బిడ్డలపై అలిగేస్తుంది అమ్మ!
    నిష్టూరాలకురిపిస్తూ నాన్నంటే కృతజ్ఞతలేదంటూ మా మనసుల్ని నాన్న గారి త్యాగాలజ్ఞాపకాలతో నింపేస్తుంది అమ్మ!

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి

ముద్దపప్పు ఎవరికి ఇష్టం ఉండదు?

మీరు సరిగ్గానే చదువుకున్నారండీ. ముద్దపప్పు అందరికీ‌ బావుంటుంది కదా? నాకూ చాలా బావుంటుంది. ముద్దపప్పు నచ్చని వాళ్ళూ ఉంటారని తెలిసాక నాకు కలిగ...